బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. పదవీకాలం ముగియడానికి దాదాపు రెండేళ్లు మిగిలి ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగానే రాజీనామా చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
స్థానిక మీడియాతో మాట్లాడిన షహాబుద్దీన్.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నందునే పదవి నుంచి తప్పుకున్నానని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను బంగాభవన్ నుంచి పార్లమెంట్‌కు పంపినట్లు బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది.
అయితే మాజీ ప్రధాని షేక్ హసీనాతో జరిగినట్లు ప్రచారంలో ఉన్న ఫోన్ సంభాషణ, అలాగే దేశంలో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు కూడా ఆయన రాజీనామాకు కారణమై ఉండొచ్చని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశాలపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు.
Post Views: 4








