E-PAPER

నీట్ వివాదం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. తెరపైకి సీజేపీ కొత్త డిమాండ్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్షల వివాదం తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపినట్లు ఒక ట్వీట్ ద్వారా వెల్లడించిన ఆయన, దేశ యువతను ఉద్దేశించి రెండు పేజీల ప్రకటనను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గత కొద్ది రోజులుగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ సీజేపీ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తూ పట్టుబట్టింది. ఈ ఆందోళనల ఫలితంగానే ఆయన తప్పుకోవడంతో వివాదం సద్దుమణిగి, నిరసనలు ఇక ఆగిపోతాయని అందరూ భావించారు. అయితే, సీజేపీ తాజాగా చేసిన ఒక సంచలన ట్వీట్ పరిస్థితిని మార్చేసింది. విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడం అనేది తాము అడిగిన వాటిలో కేవలం ఒక డిమాండ్ నెరవేరడం మాత్రమేనని పార్టీ పేర్కొంది.

తమ ప్రధాన డిమాండ్లలో ఇంకా రెండు నెరవేరాల్సి ఉందని ఆ ట్వీట్‌లో సీజేపీ తేల్చిచెప్పింది. నీట్ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తక్షణమే రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అలాగే, న్యాయం కోసం నిరసనలు తెలిపిన ఏ ఒక్క విద్యార్థి పైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఈ రెండు డిమాండ్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేస్తూ.. అప్పటివరకు వెనక్కి తగ్గేది లేదని సీజేపీ స్పష్టం చేసింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News