పలాస, జూలై 25 (వై7 న్యూస్): పలాస-కాశీబుగ్గ రైల్వే కాలనీలో జగన్నాథ స్వామివారి తిరుగు రథయాత్ర శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. గత తొమ్మిది రోజులుగా ప్రత్యేక పూజలు, ఆరాధనలు అందుకున్న జగన్నాథ స్వామి తిరుగు ప్రయాణం చేపట్టారు.
లక్ష్మీదేవి సమేతంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి రథంపై కొలువుదీరి భక్తుల మధ్య ఘనంగా రామాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కాలనీ పరిసర ప్రాంతాలు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి.
ఈ శోభాయమానమైన తిరుగు రథయాత్రలో పలాస నియోజకవర్గ ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడితో పలాస పట్టణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
Post Views: 6









