మణుగూరు, జూలై 24 (Y7 News): తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు (KTR) జన్మదినం సందర్భంగా మణుగూరులోని శ్రీ సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు, ఐటీ రంగ అభివృద్ధికి కేటీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Post Views: 8









