E-PAPER

ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలి – జిల్లా ఎన్నికల అధికారి సి.హెచ్. అనూష

మణుగూరు, జూలై 23 (వై7 న్యూస్): మణుగూరు పీవీ కాలనీలో కొనసాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి సి.హెచ్. అనూష గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (BLOలు) చేపడుతున్న ఓటరు నమోదు, వివరాల సవరణ, కొత్త ఓటర్ల చేర్పు కార్యక్రమాలను ఆమె పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆమె పేర్కొన్నారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించి సవరణలు చేయించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఎల్ఓ భద్రమ్మ, సూపర్వైజర్ రాము, బీఎల్ఓలు లీలావతి, పుల్లమ్మ, వాణి, ఎన్నిక జయలక్ష్మి, ధనలక్ష్మి, మడి వీరన్న బాబు, జకం రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News