E-PAPER

అల్లిగూడెం MPPS పాఠశాలలో మొక్కలు నాటిన సిఆర్పిఎఫ్ సిబ్బంది

చింతూరు,( వై7 న్యూస్) జూలై 23: పోలవరం జిల్లా,చింతూరు మండలం పేగ పంచాయతీ అల్లిగూడెం పాఠశాల యందు శ్రీ రితేష్ ఠాగూర్ కమాండెంట్ 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ ఆదేశాల మేరకు C/141 బెటాలియన్ పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం పెంపొందించే లక్ష్యంతో వన మహోత్సవ మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ రామకృష్ణ వేణు 141 బెటాలియన్ మాట్లాడుతూ ప్రకృతి సమాతుల్యతను కాపాడటానికి, భావితరాలకు స్వచ్ఛమైన గాలి ని అందించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, అలాగే విద్యార్థులు చిన్నతనం నుంచే పర్యావరణం పై స్పృహ కలిగి ఉండాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల పరిసరాలలో 400 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో C/141 బెటాలియన్ సిబ్బంది, పాఠశాల హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News