E-PAPER

భారత్‌లో మళ్లీ వివో S సిరీస్.. Vivo S2 ఆగస్టులో లాంచ్?

వివో దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత తన S సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. లీకైన వివరాల ప్రకారం, కొత్త Vivo S2 స్మార్ట్‌ఫోన్ ఆగస్టు తొలి వారంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే ప్రత్యేక సేల్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశముందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే Vivo S2 భారతీయ ప్రమాణాల సంస్థ BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించడం కూడా ఈ ఫోన్ లాంచ్ సమీపంలోనే ఉందనే సంకేతాలను ఇస్తోంది. లీకుల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.50 వేల లోపు ఉండే అవకాశం ఉంది.

ఇది 2019లో రూ.17,990 ధరతో విడుదలైన Vivo S1తో పోలిస్తే భారీ పెరుగుదలగా భావిస్తున్నారు. అప్పట్లో AMOLED డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో Vivo S1 వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు Vivo S2 కూడా ప్రీమియం ఫీచర్లతో భారత మార్కెట్లోకి రానుందని అంచనా వేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News