మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. ‘రాజు కంప్యూటర్స్’ నిర్వహకుడు ఓబులాపూర్ రాజు ఈరోజు ఉదయం ఆకస్మిక గుండెపోటుతో కన్నుమూశారు.
వేణు రెస్టారెంట్ సమీపంలో ఉన్న తన కంప్యూటర్ సెంటర్‌లో ఉండగానే ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమంగా మారినట్లు తెలుస్తోంది.
రాజు మరణ వార్తతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
Post Views: 30








