మణుగూరు;
మణుగూరు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ బాలు రోడ్డుకు మధ్యలో నిలబడి హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాహనాల ఫోటోలు తీస్తూ కనిపించారు. మండుతున్న ఎండ, రోడ్డుపై ఉక్కపోత ఉన్నప్పటికీ ఆయన తన స్థానాన్ని మార్చకుండా విధి నిర్వర్తించారు.
వై సెవెన్ న్యూస్ రిపోర్టర్ పులిపాటి పాపారావు అడగగా…“పక్కనే నీడ ఉంది కదా, అక్కడ నిలబడి ఫోటోలు తీస్తే కుదరదా?” అని ప్రశ్నించగా,కానిస్టేబుల్ బాలు సమాధానం ఇచ్చారు.“పక్కన నిలబడి తీస్తే బండి నెంబర్లు క్లియర్‌గా కనిపించవు సార్. అందుకే ఇక్కడే నిలబడ్డాను” అని తెలిపారు.
ఆయన సమాధానం విధి పట్ల ఉన్న నిబద్ధతను స్పష్టంగా తెలియజేసింది.
నిన్నటి ప్రమాదం గుర్తు చేస్తూ…
ఇటీవల జరిగిన ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వలన ప్రాణాలు కోల్పోయిన నిర్లక్ష్యం తెలియజేస్తున్నాయి.
*కఠిన తనిఖీలు… ప్రాణ రక్షణ కోసమే*
ప్రస్తుతం మైనర్లు కూడా వాహనాలు నడుపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇలాంటి తనిఖీలు ఉంటే వారు రోడ్డు మీదకు రావడానికి ముందు ఆలోచిస్తారు. ఇది జరిమానా కోసం కాదు ,ప్రజల ప్రాణ భద్రత కోసం.
ఎండ, వర్షం, చలి అన్న తేడా లేకుండా రోడ్లపై నిలబడి విధులు నిర్వర్తించే పోలీసుల సేవలు అభినందనీయం. కానిస్టేబుల్ బాలు లాంటి అధికారులు సమాజానికి అవసరం.
హెల్మెట్ ధరించండి… ప్రాణాన్ని కాపాడుకోండి.
ప్రజల భద్రత కోసం పనిచేస్తున్న పోలీసులకు మన సహకారం అందిద్దాం.








