E-PAPER

సిపిఎం కంచుకోటని బద్దలు కొట్టిన కాంగ్రెస్

అశ్వాపురం
అశ్వాపురం మండలం అమ్మగారి పల్లిలో నాలుగు దశాబ్దాలుగా సిపిఎం అప్రతిహత ఆధిపత్యంగా కొనసాగుతున్న సర్పంచ్ పదవికి ఈసారి చరిత్ర మార్చిన ఫలితాలు వెలువడ్డాయి. గత 40 సంవత్సరాలుగా ఎవరూ చెరుగలేని సిపిఎం కంచుకోటను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టింది.

కాంగ్రెస్ మహిళా అభ్యర్థి ఇరుప కవిత 156 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. గ్రామంలో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన ఈ ఫలితం స్థానికంగా విశేష చర్చనీయాంశం అయింది.

అమ్మగారి పల్లిలో ఎన్నాళ్లనుంచో సిపిఎం బలమైన స్థావరం ఉండగా, ఈసారి కాంగ్రెస్ విజయంతో గ్రామంలో కొత్త రాజకీయ సమీకరణాలు వెలుగులోకి వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News