E-PAPER

గరుడఖండిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభం

టీవీవై7న్యూస్ | పలాస
ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం

పలాస మండలం గరుడఖండి గ్రామంలో సోమవారం విశాఖపట్నానికి చెందిన శంకర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (APTPC) చైర్మన్ వజ్జ బాబూరావు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్ రావు, బీసీ సెల్ అధ్యక్షుడు యవ్వారి మోహనరావు మాస్టర్, పలాస మున్సిపాలిటీ 31వ వార్డు ఇంచార్జి కొరికాన శంకర్ రావు, స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రాథమిక కంటి పరీక్షల్లో అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కూన అరుణకుమారి తెలిపారు. గ్రామీణ ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో గరుడఖండి మాజీ సర్పంచ్ శాసుమాన రామారావు, తెలుగుదేశం నాయకులు శాసుమాన చంద్రమౌళి, శాసుమాన సంతోష్, నాని, ఇచ్చాపురం సీతారాం, శాసుమాన హేమచౌదరి, ఏదల్ల నాయకరావు, సత్యవతి, బుర్లే కృష్ణంరాజు, పాపారావు, కుర్మారావు, సామంతు సూర్యనారాయణ, సామంతు కేశవరావుతో పాటు పలువురు కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News