E-PAPER

నేతాజీ యువజన సంఘం సేవలు భేష్‌ ; మెజిస్ట్రేట్ రాజమల్లు, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి

– నిరాశ్రయులకు నేతాజీ యువజన సంఘం సాయం

– నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ

పాల్వంచ: సమాజ హితం కోసం తపిస్తున్న నేతాజీ యువజన సంఘం సేవలు భేష్‌ అని కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి అన్నారు.
శుక్రవారం నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్ ఆధ్వర్యంలో పాల్వంచలోని పెద్దమ్మతల్లి దేవాలయం, సి కాలనీ గేట్, పాల్వంచ బస్టాండ్, తదితర ప్రాంతాలలోని నిరాశ్రయులకు రగ్గులు, బ్రెడ్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మానవసేవే మాధవసేవగా ప్రతి ఏటా చలి కాలంలో రోడ్డు పక్కన ఉంటున్న నిరాశ్రయులు, అభాగ్యులకు నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.
నేతాజీ యువజన సంఘం అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సేవా భావం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యువత తమ పరిసర ప్రాంతంలోని అభాగ్యులకు తమ సహాయాన్ని అందించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిలాల్ నాయక్,
ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దర్ భాష, నేతాజీ యువజన సంఘం సభ్యులు ఏవి రాఘవులు, అబ్దుల్ రజాక్, జిల్లేపల్లి స్టాలిన్, సయ్యద్ అక్బర్, ఎండి బాబర్, ఓం ప్రకాష్,ముగిది శ్రీరామ్, ఏం సంతోష్, చిమ్మి నాయుడు, దుర్గాప్రసాద్, ఏరువా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News