E-PAPER

లెబర్ కోడ్‌లు రద్దు చేయకుంటే దేశవ్యాప్త ఉద్యమమే: కార్మికుల హెచ్చరిక

నల్ల బ్యాడ్జీలతో నిరసన

కోడ్‌ల ప్రతులను దగ్ధం చేసిన కాంట్రాక్టు కార్మికులు

శ్రీరాంపూర్;

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఆర్‌పీ ఓసిపి వద్ద కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం లేబర్ కోడ్‌ల ప్రతులను దహనం చేశారు.

ఈ సందర్భంగా SCKS–CITU శ్రీరాంపూర్ బ్రాంచ్ సహాయ కార్యదర్శి కాసీపేట రాజేశం మాట్లాడుతూ,దేశ అభివృద్ధి పునాదులైన కార్మిక వర్గ హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. కానీ మూడోసారి కేంద్రంలోకి వచ్చిన బీజేపీ మోదీ ప్రభుత్వం మాత్రం కార్మికుల హక్కులను బలహీనపరుస్తూ, కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధానాలనే అమలు చేస్తోంది. కార్పొరేట్ల ఖజానా నింపడానికే లేబర్ కోడ్‌లు తెచ్చారు” అని విమర్శించారు.

రాజేశం మరింతగా మాట్లాడుతూ,లేబర్ కోడ్‌లు అమలు చేస్తే కార్మికులు సంపూర్ణంగా బానిసలవుతారు. ఈ కోడ్‌లను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ఒత్తిడి తెస్తోంది. కార్మిక వర్గంతో విరోధం పెట్టుకుంటే ప్రభుత్వాలు కూడా కూలిపోతాయనే చరిత్రను కేంద్రం మరచిపోయింది. లేబర్ కోడ్‌లు వెంటనే రద్దు చేయకుంటే దేశవ్యాప్తంగా భారీ ఉద్యమం తప్పదు. ఇది జరిగితే దానికి భాధ్యత బీజేపీ ప్రభుత్వం వహించాలి” అని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో సంపత్, సురేష్, సమ్మయ్య, రాజాలింగు, విద్యాసాగర్, రాఘవేంద్ర, వినయ్, శ్రీధర్, ప్రదీప్, కుమార్ సహా పలు విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News