E-PAPER

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించండి

ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రెసిడెంట్ జయప్రకాష్ డిమాండ్

జోగులాంబ గద్వాల;
తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ లో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (ఐ ఎన్ టి యు సి)జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ ఆర్ పి జయప్రకాష్ డిమాండ్ చేశారు. గత 3 నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు అందకపోవడం తో కుటుంబ పోషణ భారం కూడా భరించ లేక మానసికంగా కృంగి కృశించి పోతున్నారని ఆయన అన్నారు. ఇంటి అద్దె, పిల్లల చదువుల ఫీజులు, పాలు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు, రవాణా చార్జీలు చెల్లించ లేక మానసికంగా,ఆరోగ్యంగా ఎంతో కష్టపడి అప్పులు చేసుకొని డ్యూటీకి వెళుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటో తేదీన రెగ్యులర్ ఉద్యోగులకు, పెన్షన్ దారులు కు వారి ఖాతాలో జమ అవుతున్నాయని మరి మాకెందుకు 3 నెలలు కావస్తున్న ఈ రోజు వరకు వారికి ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని సూటిగా రాష్ట్ర ప్రభుత్వం ను ఆయన ప్రశ్నించారు. వేతనాలు ఇవ్వకపోతే వారు ఎలా విధులు నిర్వర్తించాలని ఆయన అన్నారు. కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉన్నతాధికారులు పనులు చేయమంటారు గానీ పైసలు (వేతనాలు) ఇవ్వకుండా వారు ఎలా ఉద్యోగాలు చేస్తారో మీరే చెప్పండి అని ఆయన చెప్పారు, ఇది ఇలా ఉండగా జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏ ఎన్ ఎమ్ లు, లాబ్ టెక్నీషియన్స్, హెల్త్ అసిస్టెంట్ లు, ఫార్మాసిస్ట్ లు, స్టాఫ్ నర్స్ లు, ఈ సి ఏ ఎన్ ఎమ్ లు, సపోర్టింగ్ స్టాఫ్ లు, ఎమ్ ఎల్ హెచ్ పి లు, మెడికల్ ఆఫీసర్ లు, టి బి విభాగము తదితరులు కలిపి జిల్లా లో మొత్తం 350 మంది దాకా కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ( ఐ ఎన్ టి యు సి) జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ ఆర్ పి జయప్రకాష్ వివరించారు. తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజ నర్సింహ లకు ఆయన విజ్ఞప్తి చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News