E-PAPER

జగ్గుతండ గ్రామంలో శ్రీ రామ సీడ్స్ వారి హైబ్రిడ్ మొక్కజొన్న SRMH-609 మెగా ఫీల్డ్ డే ఘనంగా నిర్వహణ

గుండాల ,అక్టోబర్ 23 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం జగ్గుతండ గ్రామంలో గురువారం నాడు ప్రముఖ విత్తన సంస్థ శ్రీ రామ అగ్రి జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైబ్రిడ్ మొక్కజొన్న ఎస్ఆర్ఎంహెచ్-609 మెగా ఫీల్డ్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రైతులు, సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, యువ రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏయస్ఎం శ్రీ మక్కా వెంకన్న గారు మాట్లాడుతూ, “శ్రీ రామ సీడ్స్ సంస్థ రూపొందించిన SRMH-609 విత్తనం అధిక దిగుబడి, రోగనిరోధక శక్తి, అన్ని రకాల నేలలకు అనుకూలత కలిగిన ఉత్తమ రకం హైబ్రిడ్ మొక్కజొన్న విత్తనం” అని తెలిపారు. ఈ విత్తనం ద్వారా రైతులు సగటున ఎకరాకు ఎక్కువ పంట దిగుబడిని సాధించి, మంచి లాభాలు పొందవచ్చని చెప్పారు. అదే విధంగా శ్రీ రామ సీడ్స్ దేశవ్యాప్తంగా రైతు ప్రయోజనాలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తోంది. SRMH-609 రకం మొక్కజొన్న విత్తనం వర్షాభావ పరిస్థితులలో కూడా నిలకడగా పెరుగుతుంది. గింజ గుణనిలువ, పిండిపదార్థం శాతం, మరియు నాణ్యత పరంగా ఈ రకం అగ్రగామి” అని వివరించారు. తదుపరి స్థానిక రైతులు ప్రాక్టికల్ ఫీల్డ్ డెమోన్స్ట్రేషన్లో పాల్గొని, SRMH-609 విత్తనాన్ని ఇతర రకాలతో పోల్చి చూసారు. రైతులు మాట్లాడుతూ, ఈ రకం పంటలో కొమ్మ బలంగా ఉండడం, పీడకుల ప్రభావం తక్కువగా ఉండడం, మరియు గింజలు గట్టి, పసుపు రంగులో మెరిసేలా ఉండడం తమను ఆకట్టుకుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీలర్లు చాట్ల సూర్యనారాయణ బోడ లగుపతి మరియు శ్రీరామ సీడ్స్ ప్రతినిధులు శేషయ్య ఉదయ్ రవివర్మ మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News