E-PAPER

సైనికుల పోరాటం అమోఘం

ఈ పాట దేశ సైనికులకు అంకితం

వైరల్ అవుతున్న కుంగ్ ఫు విద్యార్థి పాడిన పాట

రంగారెడ్డి జిల్లా వై సెవెన్ న్యూస్ జూన్,6

దేశ రక్షణ కొరకు సైనికులు చేసే పోరాటం అద్భుతం అని వారి పోరాట స్ఫూర్తి ఎంతోమంది కి దేశభక్తి ని పెంపోందిస్తుందని ఈ పాట దేశ సైనికులకు అంకితం అని అన్నారు ఈ చిన్నారి కుంగ్ ఫు విద్యార్థి. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు విద్యార్థి గౌండ్ల నిత్విక్ గౌడ్ పాడిన ఈ దేశ భక్తి గీతం ఇప్పుడు వైరల్ అవుతుంది. న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్ అధ్యర్యంలో కుంగ్ ఫు విద్యార్థి నిత్విక్ గౌడ్ ఈ పాట పాడటం దేశ ప్రజలకు దేశభక్తి పై ఆసక్తి పెంచుతుందని దేశ సైనికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని దేశానికి రక్షణ కవచం లా ఉంటూ ఊరు ఇల్లు వదిలి బోర్డర్ లో మనo బాగుండాలని వారు రాత్రి పగలు మేల్కొని దేశాన్ని ఎలా రక్షిస్తున్నారన్నది పాట ముఖ్య ఉద్దేశం అని మాస్టర్ అహ్మద్ ఖాన్ తెలిపారు.ఈ సందర్బంగా ఈ పాట పాడిన నిత్విక్ గౌడ్ ను అభినందించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News