భద్రాచలం, మే 27 (వై7 న్యూస్)
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వెంకటాపురం మండలానికి చెందిన మేకల బటకమ్మకు రూ.18,500 చెక్కు అందించారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Post Views: 79









