కొత్తగూడెం వై7 న్యూస్
ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
సింగరేణి ప్రధాన కార్యాలయం సందర్శించి.. డైరెక్టర్ (పా)తో సమీక్ష
కొత్తగూడెం: నల్ల బంగారం వెలికితీస్తూ..శ్రమిస్తున్న సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తామని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అభయమిచ్చారు. శనివారం కొత్తగూడెం లోని సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి. ఆ సంస్థ డైరెక్టర్ (పా) కే. వెంకటేశ్వర్లు, జీఎం ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో వైద్యుల కొరత లేకుండా చూడాలని, కార్మికులకు విధి నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.ప్రభుత్వ పరంగా సింగరేణికి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఛైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాలరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, సింగరేణి ఐఎన్టీయూసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









