E-PAPER

లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తులకు ఆహ్వానం ఇదొక సువర్ణ అవకాశం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

భద్రాద్రి కొత్తగూడెం వై7 న్యూస్

తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) నుండి లైసెన్స్
సర్వేయర్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు.
ఆసక్తి గల అర్హులైన
అభ్యర్ధులు.. తెలంగాణలోని అన్ని మీ సేవ కేంద్రాలలో లైసెన్స్ సర్వే శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేయవచ్చని…
ఎంపికైన అభ్యర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాలలో మొత్తం 50 పని దినాలు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు,
అభ్యర్థుల అర్హతలు,
ఇంటర్మీడియట్ (గణిత శాస్త్రం ఒక అంశంగా ఉండాలి) కనీసం 60% మార్కులతో,
ఐటీఐ డ్రాఫ్ట్స్ మెన్ (సివిల్)
డిప్లొమా (సివిల్) బి.టెక్ (సివిల్)
లేదా ఇతర సమానమైన అర్హత
దరఖాస్తు విధానం,
దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్ను 2025 మే 5 నుండి మే 17 వరకు *మీ సేవా కేంద్రాల* ద్వారా మాత్రమే రూ. 100/- చెల్లించి పొందవచ్చు.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 17.05.2025 (మీ సేవ కేంద్రాల్లో మాత్రమే
ఫీజు వివరాలు
ఓసి అభ్యర్ధులకు రూ.10,000/-
బీసీ అభ్యర్ధులకు రూ.5,000/-
ఎస్సీ/ ఎస్టి అభ్యర్థులకు రూ.2,500/-
లైసెన్స్ కలిగిన సర్వేయర్లుగా మారేందుకు ఇదొక సువర్ణ అవకాశమని… అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మానేజ్మెంట్ నుండి విడుదల అయినటువంటి ఈ నోటిఫికేషన్ ని సద్వినియోగ పరుచుకోవాలని అట్టి ప్రకటన లో *కలెక్టర్* పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News