తూప్రాన్, ఏప్రిల్, 07. వై సెవెన్ న్యూస్
తూప్రాన్ లో ఆదివారం నాడు అంగరంగ వైభవంగా కనుల పండువగా శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అత్యంత వైభవంగా జరిగింది. భక్తజనం సీతారాముల.కల్యాణాన్ని చూసితరించారు. శ్రీరామనవమి సందర్భంగా రామాలయాన్ని ప్రజా ప్రతినిధులు, ప్రజలు, భక్తులు శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తూప్రాన్ ప్రజలందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగదానంద కారకుడు, జగదభిరాముడు, భక్తకోటి తీరొక్క పేరుతో పిలుచుకునే రాములగడ్డపై స్వయంభువుగా వెలసిన రామాలయంలో రాములోరి కల్యాణ వేడుక ఆదివారం కనుల పండువగా సాగింది. అభిజిత్ లగ్నంలో రాముడు, జగన్మాత సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని కనులారా వీక్షించిన భక్తజనం పులకించారని చెప్పారు. శ్రీ రాముని ఆశీస్సులతో ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ప్రాంతం వర్షాలతో శాష్యసామలంగా పంటలు పండాలని, పుష్కలంగా వర్షాలు పడాలని, రామాలయ దర్శనంతో కళ్యాణం వీక్షించిన ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి దంపతులు, తాజా మాజీ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ దంపతులు, సిద్దిపేట డిసిసి అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మాసాయిపేట ఆవుల రాజిరెడ్డి, ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బర్గుపల్లి ప్రతాప్ రెడ్డి, ఐ.వి.ఎఫ్ రాష్ట్ర కోశాధికారి కోడిప్యాక నారాయణ గుప్త, ఆలయ కమిటీ అధ్యక్షుడు బజారు రవీందర్, రామునిగారి శ్రీశైలంగౌడ్, చక్రవర్తి, స్వర్గం వెంకట నారాయణ, బాధే వాసుదేవ్, రేపల్లె శంకర్, మాలే కుమార్ గుప్త, బోల్లు నాగులు, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ సి ఆర్, నందాల యాదగిరి, బొంది సిద్ధిరాములుగౌడ్, సామల అశోక్ కుమార్, మామిండ్ల రవికాంత్, మధు, గడ్డం వెంకటేష్, దుర్గం నగేష్, విష్ణు, బాలరాజు, కంచరీ శ్రీహరి, మన్నె శ్రీనివాస్ రావు, మామిండ్ల అనిల్ కుమార్, మనోహరబాద్ మాజీ ఎంపిపి పురం రవి, కృష్ణారెడ్డి, తాటి విశ్వనాథ్, శ్యాం సుందర్ రెడ్డి, కమ్మరి శ్రీధర్, కుమ్మరి రఘుపతి, కుమ్మరి రమేష్, డాక్టర్ అప్సర్ భాయ్, బల్ రాంరెడ్డి, గరిగే నర్సింగ్ రావు, బాయికాది వెంకటేష్, చింతల దశరథ, బండమీద నాగరాజు గౌడ్, ఉమర్ భాయ్, అర్.నాగరాజు గౌడ్, నేత మహేందర్ రెడ్డి, తాడురీ కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.









