భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్17 వై 7 న్యూస్;
ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని ఏఆర్ డిఎస్పీ సత్యానారాయణ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా పోలీస్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఆయన చిత్రపటానికి ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఒక సామాన్య వ్యక్తిగా పుట్టి సప్తబుషుల బోధనల ద్వారా మహర్షి వాల్మీకిగా మారి అధ్బుతమైన రామాయణ గ్రంథాన్ని మనకు అందించిన మహనీయుడు వాల్మీకీ ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,హోమ్ గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు మరియు తదితరులు పాల్గొన్నారు.









