మణుగూరు,అక్టోబర్16 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామం లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామనుజవరం గ్రామ పంచాయితీ లో రోడ్లు భారీగా దెబ్బతిన్న విషయాన్ని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినాకి నవీన్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దృష్టి కి తీసుకువెళ్ళారు . ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు వెంటనే పంచాయితీ ఉన్నత అధికారులను మరమ్మతులు చేయాలని అదేశించారు . గ్రామంలో వున్న అంగన్వాడీ కేంద్రం లో కూడా గ్రావెల్ మట్టి పోసి గర్భిణీ స్త్రీ లకు,పిల్లలకి,టీచర్స్ కి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకోవాలి సూచించారు. ఈ పనులు మణుగూరు మండల అధ్యక్షులు పిరినాకి నవీన్ దగ్గర ఉండి పర్యవేక్షించి తక్షిణం స్పందించి మరమ్ముతులు చేపించిన ఎమ్మెల్యే పాయం కి మండల కమిటీ, గ్రామ కమిటీ, గ్రామ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రామానుజవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ళ ముత్తయ్య, బడిశ నాగేష్, షేక్ లతీఫ్,రాసమల్ల నాగరాజు , కేతినేని రాజేష్, సాధీని గోవర్ధన్, సాధీని సీతయ్య , తమ్మిసెట్టి సాంబ, మండవ ప్రసాద్, దొంతుసర్పు గంగాధర్, పురం భిక్షం, జూపల్లి ముత్తయ్య, డేగల కృష్ణారావు, కట్ట నరసింహారావు, వేమూరి కిరణ్, కుక్కునూరు శ్రీకాంత్, ఆకుల నరసింహ రావు, మచ్చ ముత్తయ్య, sk ఇసుబ్, బొగ్గుల వెంకట్, పప్పుల భాస్కర్, కమ్మచిచ్చు కృష్ణ, నెలపాటి కిరణ్ కుమార్ ,సోషల్ మీడియా సభ్యులు పురం భాస్కర్, బొల్లాం రాజేష్ , కార్యకర్తలు పాల్గొన్నారు..









