E-PAPER

భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో దాడి

వై సెవెన్ న్యూస్ పినపాక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలోని గొందిగూడెం గ్రామంలో భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో దాడి చేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం గొందిగూడెం గ్రామానికి చెందిన కుర్సం సత్యావతి 30 గత కొంతకాలంగా అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రైవేట్ గా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో భర్త సురేష్ ఆమెపై అనుమానం పెంచుకొని దీంతో భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతుంది సోమవారం వివాదం జరగడంతో సురేష్ గొడ్డలితో భార్యపై దాడికి పాల్పడి కాలు,చేయి నరికాడు స్థానికులు గమనించి 108 ద్వారా భద్రాచలం ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అశ్వాపురం ఎస్ఐ తిరుపతిరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్