పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని పాలవలస జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ లారీ రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో ఇంటి సమీపంలోని విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయం కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
Post Views: 16








