E-PAPER

కలవలనాగారంలో 700 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

నాటుసారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం.. ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు హెచ్చరిక

కరకగూడెం, నవంబర్ 11 (వై సెవెన్ తెలుగు న్యూస్):

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కలవలనాగారం గ్రామంలో మణుగూరు ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామ సమీపంలోని వాగు ఒడ్డున అక్రమంగా పులియబెట్టిన 700 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

ఈ విషయాన్ని మణుగూరు ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు వెల్లడించారు. అక్రమంగా బెల్లం పానకం తయారు చేయడం, నిల్వ ఉంచడం, నాటుసారా తయారీకి ఉపయోగించడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలకు సహకరించే వారితో పాటు, దాని తయారీకి అవసరమైన ముడిసరుకులు విక్రయించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని తెలిపారు.

ఈ దాడుల్లో మణుగూరు ఎక్సైజ్ ఎస్ఐ విజయభాస్కర్, శిక్షణ ఎస్ఐ వేణు, సిబ్బంది నాగరాజు, రామకృష్ణ, రమేష్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

– కరకగూడెం రిపోర్టర్ దిలీప్ కుమార్, వై సెవెన్ ప్రతినిధి

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!