గేటు తగలడంతో చేతికి ఫ్రాక్చర్.. 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలింపు

పలాస, నవంబరు 7 (Y7 న్యూస్): శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొలిగాం పంచాయతీ కార్యదర్శి విజయగౌరీ గాయపడ్డారు.
ఇచ్చాపురం మండలం కొలిగాం పంచాయతీలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న విజయగౌరీకి కౌంటింగ్ కేంద్రం వద్ద గేటు తగలడంతో చేతికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.
వెంటనే స్పందించిన అక్కడి సిబ్బంది 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ చేరుకున్న అనంతరం ఆమెను మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
Post Views: 20








