నియామక పత్రం అందజేసిన జిల్లా అధ్యక్షులు పసులాది ముఖేష్
ములుగు జిల్లా నవంబర్ 02 Y7 న్యూస్ తెలుగు
ములుగు జిల్లాలో సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ ప్రజలకు సమాచార హక్కుపై అవగాహన కల్పించడం ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతను పెంపొందించడం అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ ములుగు అసెంబ్లీ అధ్యక్షులుగా ఐలాపూర్ గ్రామం కన్నాయిగూడెం మండలానికి చెందిన మందపెళ్లి సతీష్ కుమార్ను నియమించడం జరిగింది కమిటీ వ్యవస్థాపకులు జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, జాతీయ ఉపాధ్యక్షులు ఏటి ఆంజనేయులు ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎలిగండ్ల వెంకటేష్ ముదిరాజ్ సూచనలతో ములుగు జిల్లా అధ్యక్షులు పసులాది ముఖేష్ అధికారికంగా నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ములుగు అసెంబ్లీ అధ్యక్షులు మందపెళ్లి సతీష్ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాచార హక్కు చట్టం పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎం.డి. సలీమ్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుముల సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు









