మంగపేట: మంగపేట పోలీస్ స్టేషన్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ మధుకర్‌ను జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ – మంగపేట ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మధుకర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంగపేట ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ఆయన బాధ్యతలు విజయవంతంగా కొనసాగాలని ట్రస్ట్ సభ్యులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి గౌడ్, ఉపాధ్యక్షులు పుల్లం శెట్టి అజయ్, గంగుల చంటి, వై. విరన్ కుమార్, కార్యదర్శులు పున్నెం భాస్కర్, గోలి నరేష్, నిమ్మల నరేష్, కోశాధికారులు నూతలకంటి ఈశ్వర్ చందు, ప్రచార కార్యదర్శులు గగ్గూరి మహేష్, మమ్మద్ ఖాజా పాషా, మామిల్ల నాగరాజు పాల్గొన్నారు.
అలాగే గౌరవ సలహాదారులు కోలగట్ల నరేష్ రెడ్డి, చాదా మల్లయ్య, సిద్ధంశెట్టి కనకారావు, లిక్కి రమేష్, కార్యవర్గ సభ్యులు సాంబశివరావు, సతీష్, అనిల్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.








