E-PAPER

ఎస్జీఎఫ్ అండర్-19 ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రికెట్ జట్టుకు భద్రాద్రి జిల్లా క్రీడాకారులు ఎంపిక

భద్రాచలం:
పాఠశాలల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-19 ఉమ్మడి ఖమ్మం జిల్లా క్రికెట్ జట్టుకు భద్రాద్రి జిల్లా కు చెందిన నలుగురు యువ క్రికెటర్లు ఎంపికయ్యారు.
భద్రాచలంలోని చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ (Chethana Best Cricket Academy) లో శిక్షణ పొందుతున్న సందీప్ నాయక్, కటుకోజ్వల కేశవ్ వికాస్, తిల్పత్ నాయక్, నందరాజ్ నాయక్ ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా జట్టులో చోటు దక్కించుకున్నారు.
కోచ్ శరణ్ తేజ పర్యవేక్షణలో ఉత్తమ శిక్షణ పొందిన ఈ క్రీడాకారులు జట్టుకు ఎంపిక కావడం పట్ల అకాడమీ నిర్వాహకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అకాడమీ ప్రతినిధులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!