శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతరకుడ్డ గ్రామంలోని 7వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తలాసు శ్రీ పద్మ సతీష్, 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సంపతిరావు జయరాంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ఓటర్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, స్థానిక పురపాలక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నాయకులు ప్రచారం నిర్వహించారు.
ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 9








