పలాస, శ్రీకాకుళం జిల్లా | Y7 న్యూస్ తెలుగు:
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 17వ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ త్యాడి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ఓటర్లను కలుసుకుని, తన ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు.
ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన చంద్రశేఖర్ త్యాడి.. వార్డులో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాల గురించి తెలుసుకున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 19








