E-PAPER

కవాసకి నుంచి మరో ప్రీమియం మోటార్​సైకిల్..! ధర ఎంతంటే..?

ప్రీమియం టూ-వీలర్ తయారీ సంస్థ కవాసకి ఇండియా భారత్​లో “2027 కవాసకి Z1100” మోడల్​ను లాంఛ్ చేసింది. దీని ధరను రూ. 12.79 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ షోరూమ్‌లలో దీని బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

2027 కవాసకి Z1100 పవర్​ట్రెయిన్: కంపెనీ ఈ మోడల్​లో ఎటువంటి యాంత్రిక మార్పులు చేయలేదు. ఈ ‘సూపర్-నేకెడ్’ మోటార్‌సైకిల్ అన్ని విధాలుగా దాని మునుపటి వెర్షన్‌నే పోలి ఉంటుంది. ఇందులో అదే 1099cc, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఈ ఇంజిన్ 136hp పవర్‌, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇదే ఇంజిన్​ను ఇటీవల అప్డేట్ చేసిన అడ్వంచర్ టూరర్ “కవాసకి వెర్సిస్ 1100″లోనూ ఉపయోగించారు. అయితే దీని ట్యూనింగ్​లో స్వల్ప తేడా ఉంది. వెర్సిస్ 1100లో ఈ ఇంజిన్ 135hp పవర్, 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2027 కవాసకి Z1100 హార్డ్​వేర్: ఈ మోటార్‌సైకిల్ హార్డ్‌వేర్ విషయానికి వస్తే, ఇందులో ట్యూబ్యులర్ డైమండ్ ఛాసిస్ ఉంది. ముందు భాగంలో 120mm ట్రావెల్‌తో 41mm USD ఫోర్కులు, వెనుక భాగంలో 136mm ట్రావెల్‌తో బ్యాక్-లింక్ మోనోషాక్ ఉన్నాయి. USD ఫోర్కుల్లో కంప్రెషన్, రీబౌండ్ అడ్జస్ట్‌మెంట్లు ఉండగా, మోనోషాక్‌లో ప్రీలోడ్, రీబౌండ్ సర్దుబాటు సౌకర్యాలు ఉన్నాయి.

బ్రేకింగ్ కోసం, బైక్ ముందువైపు 310mm డ్యూయల్ కవాసకి-బ్రాండెడ్ బ్రెంబో డిస్క్​లు, వెనుకవైపు 260mm సింగిల్ డిస్క్ ఉన్నాయి. Z1100లో 5-అంగుళాల TFT డిస్‌ప్లే, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, మూడు స్థాయిల కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS, క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక రైడర్ సహాయక ఫీచర్లు ఉన్నాయి.

ఈ మోటార్‌సైకిల్‌లో 17-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇది కొత్త కవాసకి Z1100 సుదూర ప్రయాణాలు చేయడానికి వీలు కల్పిస్తుంది. దీని కెర్బ్ వెయిట్ 220 కేజీలు అయినప్పటికీ, అన్ని రకాల రోడ్లపై చాలావరకు బైక్‌ను సులభంగా నియంత్రించవచ్చని కంపెనీ చెబుతోంది.

మార్కెట్లో దీని ప్రత్యర్థులు: దీని ధర రేంజ్​లో ఈ మోటార్‌సైకిల్ రూ. 13.29 లక్షల ధర కలిగిన “హోండా CB1000 హార్నెట్ SP” వంటి మోడళ్లతో తలపడనుంది. మరోవైపు, దీని కంటే చిన్నదైన “కవాసకి Z900” రూ. 9.99 లక్షలకే అందుబాటులో ఉంది.

ఇదిలా ఉండగా కంపెనీ ఇటీవలే తన Z-సిరీస్‌లో “కవాసకి Z300” పేరుతో మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. దీన్ని నింజా 300 ఆధారంగా రూపొందించారు. భారత మార్కెట్‌లో ఈ మోటార్‌సైకిల్ కంపెనీ Z-సిరీస్​లో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా నిలవనుంది. దీని మొత్తం డిజైన్‌ను Z900 నుంచి తీసుకున్నప్పటికీ, ఇది క్లాసిక్ స్ట్రీట్‌ఫైటర్ లుక్‌లో వస్తోంది. ఈ బైక్‌లో నిటారుగా కూర్చునే రైడింగ్ పొజిషన్, Z900 నుంచి స్ఫూర్తి పొందిన స్టైలింగ్, అప్‌డేట్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిపై మరిన్ని వివరాల కోసం

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!