E-PAPER

బాధితులకు సత్వర న్యాయం అందించాలి: సీపీ సునీల్ దత్

* ఖమ్మం కమిషనరేట్‌లో ప్రజావాణి నిర్వహణ
* ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదని అధికారులకు హెచ్చరిక
ఖమ్మం, అక్టోబర్ 19:
ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా చూడాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమంలో భాగంగా ఆయన స్వయంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రజావాణికి భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత కలహాలు, భార్యాభర్తల గొడవలు మరియు ఆర్థిక లావాదేవీల మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వచ్చాయి. వచ్చిన ప్రతి ఆర్జీని నిశితంగా పరిశీలించిన సీపీ, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి చట్టపరిధిలో వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ— ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు. సమస్యల తీవ్రతను బట్టి చట్టప్రకారం బాధితులకు అండగా నిలవాలని, విధి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం, విశ్వాసం పెరిగేలా సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!