మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం శివలింగాపురం గ్రామానికి చెందిన బానోత్ సక్రు (38) మృతి చెందాడు. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఆయన మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో సక్రు ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. మృతుడి తల్లి బానోత్ బుల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 211








