శ్రీకాకుళం జిల్లా, పలాస | Y7 న్యూస్ తెలుగు
క్రీడలే ఆరోగ్యానికి, క్రమశిక్షణకు, విజయానికి పునాది!
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన స్వర్ణ క్రీడోత్సవంలో భాగంగా 50వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల, మహిళల టెన్నికాయిట్ ఛాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పాల్గొన్న ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.
క్రీడలు కేవలం గెలుపోటములకే పరిమితం కావని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి, జట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిరంతర సాధనతోనే ప్రతిభకు పదును పెట్టి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.
ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలాస ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు, క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి పోటీలకు ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.
Y7 NEWS TELUGU | ప్రజల గొంతుక









