E-PAPER

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు తుగ్గలి బాలిక ఈడిగ వర్షిని ఎంపిక

బౌలింగ్‌లో ప్రతిభ చాటి జిల్లా జట్టులో చోటు.. అభినందించిన సాధన విద్యానికేతన్ కరస్పాండెంట్

తుగ్గలి, అక్టోబర్ 13, Y7 న్యూస్ తెలుగు:

క్రికెట్‌లో ప్రతిభ కనబరిచి తుగ్గలి గ్రామానికి చెందిన బాలిక ఈడిగ వర్షిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. కర్నూలులో బాల సాయిబాబా స్కూల్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అండర్‌–17 బాలికల క్రికెట్ పోటీల్లో వర్షిని తన బౌలింగ్‌ ప్రతిభను చాటుకుంది. ఈ నెలలో మచిలీపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే కర్నూలు జిల్లా జట్టులో ఆమెకు చోటు లభించింది.

తుగ్గలి గ్రామానికి చెందిన ఈడిగ వాటర్ రామంజి కుమార్తె అయిన వర్షిని, పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గత ఏడాది నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సాధన విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో క్రికెట్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతోంది. నిరంతర సాధన, కృషి, పట్టుదలతో జిల్లా జట్టుకు ఎంపికై రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

ఈ సందర్భంగా వర్షిని మాట్లాడుతూ.. గత సంవత్సరం నుంచి సాధన విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నానని, కోచ్‌ల ప్రోత్సాహం, నిరంతర సాధన తన ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి దోహదపడ్డాయని తెలిపింది.

వర్షిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై సాధన విద్యానికేతన్ కరస్పాండెంట్ అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!