భద్రాచలం, అక్టోబర్ 13 (Y7 న్యూస్ తెలుగు):
భద్రాచలంలోని హరిత హోటల్‌లో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం–నల్గొండ–వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ చర్ల మండల మహిళా నాయకురాలు కుప్పాల సౌజన్య ఎమ్మెల్సీ రవీందర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు ఉన్న ప్రాధాన్యత, అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం, ప్రజల్లో ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాల్సిన అంశాలపై ఇరువురూ స్నేహపూర్వకంగా చర్చించారు.
Post Views: 38









