E-PAPER

అన్ని దానాల కంటే అన్నదానం మిన్న: సీఐ వెంకటేశ్వర్లు

కే.యన్.ఆర్. యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామి సన్నిధిలో మహా అన్నసంతర్పణ

చుంచుపల్లి, సెప్టెంబర్ 28 (Y7 న్యూస్):
చుంచుపల్లి మండలంలోని ఎస్‌సీబీ నగర్‌లో గల శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ సన్నిధిలో కే.యన్.ఆర్. యూత్ ఆధ్వర్యంలో సోమవారం మహా అన్నసంతర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చుంచుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్‌ఐ గడ్డం ప్రవీణ్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని అన్నారు. భగవంతుని సన్నిధిలో మహా ప్రసాదాన్ని స్వీకరించడం భక్తులకు దక్కే అరుదైన అదృష్టమని పేర్కొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, భక్తులు కోరుకున్న మనోభీష్టాలు నెరవేరాలని ఆకాంక్షించారు.

అనంతరం సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్‌ఐ ప్రవీణ్ భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కే.యన్.ఆర్. యూత్ నాయకులు, సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!