శ్రీరాంపూర్, సెప్టెంబర్ 27 (Y7 News Telugu): శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొలెరో జీప్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర కనీస వేతన బోర్డు చైర్మన్, INTUC జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కాసిపేట రాజేశంతో పాటు శివ, మల్లేష్ తదితరులు డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి, రవాణా ప్రక్రియలో భాగంగా కొన్నేళ్లుగా తక్కువ వేతనాలతో క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
బొలెరో జీప్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జనక్ ప్రసాద్‌ను కోరారు. డ్రైవర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అసోసియేషన్ ప్రతినిధుల వినతిని జనక్ ప్రసాద్ సానుకూలంగా పరిశీలించాలని కోరినట్లు వారు తెలిపారు.








