E-PAPER

పల్నాడులో చోరీల ముఠా అరెస్ట్.. భారీగా బంగారం, వెండి స్వాధీనం ; జిల్లా ఎస్పీ జగదీష్

పల్నాడు జిల్లా, సెప్టెంబర్ 27, Y7 న్యూస్ తెలుగు:
పల్నాడు జిల్లాలో వరుసగా జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఎడ్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసుతో పాటు నాదెండ్ల, చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నమోదైన మొత్తం నాలుగు కేసులను పోలీసులు ఛేదించినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు.
ఈ కేసులకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 362 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.9 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.02 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
చోరీలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు. నిందితులను విచారించగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన మరికొన్ని చోరీ కేసులకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తులో మరికొంత బంగారం రికవరీ కావాల్సి ఉందని తెలిపారు.
చోరీ కేసులను సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ జగదీష్ అభినందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!