కొత్తగూడెం, సెప్టెంబర్ 26: ప్రపంచ మానవ హక్కుల సంఘం (WHRA) తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలిగా కె. గీతను నియమించారు.
ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ ఛైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ఛైర్పర్సన్ చల్లా గీతారెడ్డి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళల హక్కులు, మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను కె. గీత నిర్వర్తించనున్నట్లు సంస్థ పేర్కొంది.
జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమితులైన కె. గీతకు WHRA కుటుంబ సభ్యులు, పలువురు ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెను సంస్థలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు చల్లా గీతారెడ్డి పేర్కొన్నారు.
Post Views: 146









