E-PAPER

కొత్తగూడెంలో గణనాథుల శోభాయాత్ర ప్రారంభం ; ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాలు నిర్వహించాలి: ఎమ్మెల్యే కూనంనేని

కొత్తగూడెం, సెప్టెంబర్ 25:
కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం గణనాథుల శోభాయాత్రను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

తొలుత వినాయకుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.. అనంతరం భక్తుల జయజయధ్వానాల మధ్య శోభాయాత్రను ప్రారంభించారు. అనంతరం త్రీటౌన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్దకు చేరుకుని, వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం గోదావరి తీరానికి నిమజ్జనం కోసం తరలివెళ్తున్న గణనాథుల విగ్రహాలకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు, గణనాథుల శోభాయాత్ర భక్తిభావంతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలుగా నిలుస్తున్నాయని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉత్సవాలను నిర్వహించడం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.

సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిమజ్జనోత్సవాల సందర్భంగా ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు సంయమనం పాటించి శాంతియుత వాతావరణంలో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్, నాగ సీతారాములు, లక్ష్మీప్రసన్న, కోనేరు చిన్ని, లక్ష్మణరావు, యెర్ర కామేష్, దేవాదాయ శాఖ కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!