చింతూరు,( వై7 న్యూస్ తెలుగు), సెప్టెంబర్ 23: పోలవరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సరివేల గ్రామానికి చెందిన 9 నెలల నిండు గర్భిణి శ్రీమతి కొవ్వసి మల్లిక (అంచనా డెలివరీ తేదీ 21-09-2026) రవాణా సౌకర్యం లేక వర్షంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన డా. ఎన్. విశ్వ చైతన్య, జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారి (ఇన్చార్జి), చింతూరు డివిజన్ సమయానికి స్పందించి, తన వాహనంలోనే సురక్షితంగా సీహెచ్సీ, చింతూరు కు తరలించారు. ఈ సందర్భంగా డా. విశ్వ చైతన్య మాట్లాడుతూ భారీ వర్ష హెచ్చరికల దృష్ట్యా ఏ గర్భిణికి రవాణా ఇబ్బంది రాకూడదు. అన్ని పీహెచ్సీల పరిధిలోని హై రిస్క్ గర్భిణులను ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు” ఇప్పటికే హై రిస్క్ గర్భిణులను సురక్షితంగా హాస్పిటల్ కి చేర్పించడం జరిగింది.
Post Views: 9







