హుజూర్నగర్, సెప్టెంబర్ 20: హుజూర్‌నగర్‌లో వినాయక నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో ఈసారి కూడా రికార్డు స్థాయిలో ధర పలికింది.
పట్టణంలోని 3వ వార్డు గణేష్‌నగర్‌లో నిర్వహించిన లడ్డూ వేలం పాటలో సపావత్ రంగా నాయక్ రూ.1,20,100లకు లడ్డూను దక్కించుకున్నారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా లడ్డూకు భారీ ధర పలకడంతో గణేష్‌నగర్‌లో భక్తుల్లో ఆనందం వ్యక్తమైంది. వేలం పాటకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Post Views: 20








