E-PAPER

నాని జడల వెనుక ఇంత స్టోరీ ఉందా..? తెలిస్తే షాక్ అవుతారు..!

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాని ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నిన్న చెన్నైలో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నాని నేడు బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇదివరకు నాని సినిమాలు అంటే నాని ఈ సినిమాలలో లవర్ బాయ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు కానీ ది ప్యారడైజ్ సినిమాలో మాత్రం నాని విభిన్నమైన లుక్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పొడువాటి గడ్డం, ముక్కు పుడక, రెండు పొడవాటి జడలతో ఊర మాస్ లుక్ లో నాని కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. నాని కెరియర్ లోనే ఇప్పటివరకు చేయని సాహసం ది ప్యారడైజ్ సినిమా కోసం చేస్తున్నారని చెప్పాలి.

ఇక బెంగళూరులో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ నానిని ప్రశ్నిస్తూ అసలు ఈ సినిమాలో మీ జడల వెనుక ఉన్న కాన్సెప్ట్ ఏంటి సర్ అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ… సినిమాలో నేను వేసుకున్న జడలు కేవలం లుక్ కోసం మాత్రం కాదు ఈ జడల వెనుక పెద్ద స్టోరీ ఉందని అయితే అది మీరంతా థియేటర్లలో చూస్తేనే బాగుంటుంది అంటూ నాని మాట దాటవేశారు. అయితే ఈ జడలు లుక్ కోసం కాదని ఈయన క్లారిటీ ఇవ్వడంతో ఈ జడల వెనుక పెద్ద స్టోరీనే ఉందని స్పష్టమవుతుంది. మరి నాని జడల కాన్సెప్ట్ ఏంటో తెలియాలి అంటే సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే.

ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ప్యారడైజ్ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాని తల్లిగా సోనాలి కులకర్ణి నటించిన సంగతి తెలిసిందే. నాని జోడిగా ఖయాదలోహర్ నటించగా ఏసనాగుల కట్ట అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్ లో మాత్రం కీర్తి సురేష్ (Keerthy Suresh)అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసాయి. మరి సెప్టెంబర్ 24న రాబోతున్న ప్యారడైజ్ సినిమా ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!