ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు.
2027 ఏప్రిల్ 7న ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రకటన నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కావడంతో సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌పై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా నిర్వహించిన ఓ ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘వారణాసి’తో పాటు దర్శకుడు రాజమౌళి గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Post Views: 4









