పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ, మంచి కంటెంట్‌తో వస్తున్న చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా యువ నటుడు సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ‘రోమాంచకం’ చిత్రానికి తనదైన శైలిలో మద్దతు అందించారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో యువతను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
‘రోమాంచకం’ సెప్టెంబర్ 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడటంతో పాటు ప్రభాస్ సపోర్ట్ లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.








