E-PAPER

హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాలు.. ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలకు సిద్ధం?

ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన అమెరికా.. తాజాగా మరిన్ని కఠిన చర్యలు తీసుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై కూడా చర్చ మొదలైంది.

హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు రెండేళ్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. అలాంటి మార్గాలు ఏర్పడితే వ్యూహాత్మకంగా కీలకమైన ఈ జలమార్గం ప్రాధాన్యం కోల్పోయే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇరాన్‌కు ఉన్న కీలక భౌగోళిక, ఆర్థిక ప్రాధాన్యంపై ప్రభావం పడే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతున్న సమయంలో బెసెంట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హార్ముజ్ జలసంధి ద్వారా భారీ స్థాయిలో చమురు, ఇతర ఇంధన ఉత్పత్తుల రవాణా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులోకి వస్తే ఇరాన్‌పై ఆంక్షల ప్రభావాన్ని మరింత పెంచేందుకు అమెరికాకు అవకాశం లభించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!