E-PAPER

పిల్లల కోసం HMD కొత్త ఫీచర్ ఫోన్.. స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉంచేలా ప్రత్యేక ఫీచర్లు!

పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువగా అలవాటు పడకుండా.. అవసరమైన సమయంలో తల్లిదండ్రులతో కనెక్ట్ అయ్యేలా HMD కొత్త ఫీచర్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అదే HMD 105 4G School Edition. పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్‌లో స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే సోషల్ మీడియా, వెబ్ బ్రౌజింగ్ వంటి దృష్టి మరల్చే అంశాలకు చోటివ్వలేదు.

పిల్లల వినియోగాన్ని నియంత్రించేందుకు ఇందులో పేరెంటల్ కంట్రోల్ సదుపాయాన్ని అందించారు. అలాగే వెబ్ బ్రౌజర్ లేకపోవడంతో విద్యార్థులు ఇంటర్నెట్‌లో అనవసరంగా బ్రౌజింగ్ చేసే అవకాశం తగ్గుతుంది. అదే సమయంలో 4G కనెక్టివిటీ ఉండటంతో కాల్స్, ఇతర అవసరమైన కమ్యూనికేషన్‌ కోసం ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఇక ఈ ఫోన్‌లో రిమూవబుల్ బ్యాటరీ, IP54 రేటింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ అవసరం లేని విద్యార్థులకు, పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలనుకునే తల్లిదండ్రులకు ఈ ఫోన్ ఉపయోగకరంగా ఉండేలా HMD రూపొందించింది. మొత్తంగా పిల్లలకు అవసరమైన కమ్యూనికేషన్ సదుపాయాలను అందిస్తూనే.. స్మార్ట్‌ఫోన్‌ వల్ల కలిగే దృష్టి మళ్లింపులను తగ్గించడమే ఈ ఫోన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!