లెనోవో నుంచి కొత్త “Legion Tab Y700 AI (2026)” టాబ్లెట్ అధికారికంగా విడుదలైంది. గతేడాది వచ్చిన Y700 మోడల్‌కు కొనసాగింపుగా ఈ కొత్త టాబ్లెట్‌ను కంపెనీ తీసుకొచ్చింది. అధిక పనితీరు, గేమింగ్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్ ప్రస్తుతం చైనా మార్కెట్లో విక్రయానికి అందుబాటులోకి వచ్చింది. చిన్న సైజులో ప్రీమియం పనితీరు కోరుకునే గేమర్లను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది.
Legion Tab Y700 AI (2026)లో శక్తివంతమైన హార్డ్‌వేర్, అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, గేమింగ్‌కు అనువైన ఫీచర్లు అందించినట్లు సమాచారం. టాబ్లెట్ పరిమాణం కాంపాక్ట్‌గా ఉండటంతో గేమింగ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు కూడా ఉపయోగపడనుంది. గత మోడల్‌తో పోలిస్తే పనితీరు, AI సామర్థ్యాలు, థర్మల్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో అప్గ్రేడ్లు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
ప్రస్తుతం ఈ టాబ్లెట్ చైనా మార్కెట్లో విక్రయానికి వచ్చింది. గేమింగ్ ట్యాబ్లెట్ విభాగంలో లెనోవో Legion సిరీస్‌కు ఇప్పటికే మంచి గుర్తింపు ఉండటంతో.. కొత్త Y700 AI (2026)పై టెక్ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. భారత మార్కెట్లోకి ఈ టాబ్లెట్ ఎప్పుడు వస్తుంది, ధర ఎంత ఉంటుంది అనే వివరాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.









